మైత్రీలో ఇంకోసారి చైతూ.. ఈ సారైనా హిట్ దక్కేనా!?
on Jan 31, 2022

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. `మజిలీ`, `వెంకిమామ`, `లవ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన చైతూ.. త్వరలో `లాల్ సింగ్ చద్ధా`(హిందీ), `థాంక్ యూ` సినిమాలతో సందడి చేయనున్నాడు. అదేవిధంగా ఓ వెబ్ - సిరీస్ లోనూ ఎంటర్టైన్ చేయనున్నాడు. అలాగే పరశురామ్, `నాంది` ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తన తదుపరి చిత్రాలు చేయనున్నాడు.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా `శ్యామ్ సింగ రాయ్`తో ఆకట్టుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలోనూ చైతూ ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందట. అంతేకాదు.. చైతూ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. అయితే, ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లో `సవ్యసాచి` అనే సినిమా చేశాడు చైతూ. అప్పట్లో `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం`.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న మైత్రీకి అదే ఫస్ట్ నెగటివ్ రిజల్ట్ మూవీ. మరి.. రెండో ప్రయత్నంలోనైనా చైతూ, మైత్రీ కాంబో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



