Home

»

Latest News

కరోనా ఉంటే ఏంటి? అల్లుడు అదుర్స్ అంతే!

Mar 18, 2020 12:01PM

కరోనా దెబ్బకు షెడ్యూల్ కంటే కొన్ని రోజుల ముందే ప్యాకప్ చెప్పేస్తున్నారు కొంతమంది సినిమా జనాలు. కొందరు అయితే షూటింగులు వాయిదా వేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ధైర్యంగా షూటింగ్ చేస్తున్నాడు. 'కందిరీగ', 'రభస' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'అల్లుడు అదుర్స్'. ఈ సినిమా షూటింగ్ ఒక లావిష్ బంగ్లాలో జరుగుతోంది. కరోనాను సైతం లెక్క చేయకుండా టీమ్ అంతా కష్టపడుతోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మీద సీన్స్ తీస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనూ ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్లో ఫ్యామిలీ అండ్ లవ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ చేయాలనుకునట్టున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కరోనా కారణంగా షూటింగుకు గ్యాప్ ఇస్తే కష్టమవుతుందని కరోనా కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమాలో నభా నటేష్ మరో హీరోయిన్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com