ఆ హీరోయిన్ను సెక్సువల్ ఫేవర్ అడిగిన ప్రొడ్యూసర్!
on Mar 18, 2020
ఇండియాలో 'మీ టూ' ఉద్యమాన్ని బాలీవుడ్ తార తనుశ్రీ దత్తా ప్రారంభించిందని చెప్పాలి. సీనియర్ యాక్టర్ నానా పటేకర్‌పై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రాధికా ఆప్టే, కల్కీ కొచ్లిన్, సుర్వీన్ చావ్లా, కంగనా రనౌత్ వంటి బాలీవుడ్ తారలు చిత్రసీమలోని చీకటి కోణాల గురించి బహిరంగంగా చెప్పారు. టాలీవుడ్లో ఇప్పటివరకూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్లెవరూ లైంగిక వేధింపుల విషయంలో స్పందించలేదు. ఒక్క శ్రీరెడ్డి మాత్రమే మాట్లాడారు. తొలిసారి ఒక తార ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌ను తాను ఎదుర్కొన్నానంటూ ముందుకు వచ్చింది. ఆమె.. విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' మూవీలో హీరోయిన్గా నటించిన వాణీ భోజన్.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె తాను ఎదుర్కొన్న ఒక ఘటన గురించి తెలిపింది. "చిత్ర పరిశ్రమలో నేను అడుగుపెట్టినప్పుడు సినిమా అవకాశానికి బదులుగా తనకు ఫేవర్ చేయమని అడిగాడు. అప్పుడు నాకు ఫేవర్ అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది, అతను అడిగింది సెక్సువల్ ఫేవర్ అని" ఆమె చెప్పింది. ఆ నిర్మాత పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.
షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోగా పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జోడీగా వాణీ భోజన్ ప్రదర్శించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాకముందు ఆమె పలు తమిళ టీవీ సీరియల్స్‌లో నటించి, ఉత్తమ నటిగా అవార్డులను పొందింది. ప్రస్తుతం అధర్వ మురళి జోడీగా ఒక తమిళ సినిమా చేస్తోంది.