'సెక్సీగా ఉండటం వేరే లెవల్ కష్టతరమైన పని'.. సమంత తగ్గట్లేదుగా!
on Dec 22, 2021

సమంత 'తగ్గేదే లే' అంటోంది. నాగచైతన్యతో విడిపోయాక స్వేచ్ఛగా విహరిస్తోన్న విహంగం మాదిరిగా ఉన్నట్లుంది ఆమె పరిస్థితి. పెళ్లయ్యాక ఆమె చేసిన పాత్రలను, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులను కొంతమంది భూతద్దంలో చూడ్డం మొదలైన విషయం మనకు తెలుసు. పెళ్లయిన కొత్తలోనే 'రంగస్థలం'లో చేసిన రామలక్ష్మి పాత్ర నుంచే ఆమెపై విమర్శలు స్టార్టయ్యాయి. ఆ మూవీలో ఆమె ఒకట్రెండు బోల్డ్ సీన్స్‌లో నటించింది.
ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టులను పలువురు టార్గెట్ చేస్తూ వచ్చారు. 'ఒక పెద్ద కుటుంబానికి కోడలిగా వచ్చి ఆ డ్రస్సులేంటి, ఆ క్యారెక్టర్లేంటి?' అంటూ ఆమెపై మాటల దాడి చేస్తూ వచ్చారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో చేసిన రాజీ క్యారెక్టర్ విషయంలో ఆమెపై మరింతగా విమర్శలు వచ్చాయి. సమంత బరితెగించిందంటూ కామెంట్లు చేసినవారున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఆకస్మికంగా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని ఇంటిపేరును తీసేసి, షాకిచ్చింది సమంత. దాంతో సమ్‌థింగ్ రాంగ్ ఇన్ హర్ మ్యారీడ్ లైఫ్ అంటూ సోషల్ మీడియా పోటెత్తుతూ వచ్చింది. చివరకు అదే నిజమైంది. తామిద్దరూ విడిపోతున్నట్లు సమంత, నాగచైతన్య విడివిడిగా ఒకేసారి ప్రకటించారు.
Also read: మహేష్ బాబు నా హీరో అన్న రాజమౌళి.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
అప్పట్నుంచీ అక్కినేని ఫ్యాన్స్ సమంతను మరింతగా టార్గెట్ చేస్తూ వస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. ఆమె ప్రతి మూవ్‌మెంట్‌ను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఇది సమంతకు తెలుసు. అందుకే అలాంటివారికి తగ్గట్లుగా ఆమె పోస్టులు పెడుతూ వస్తోంది. కాగా, 'పుష్ప' మూవీలో "ఊ అంటావా మావా" అనే ఐటమ్ సాంగ్ చేసి, మరోసారి తన హేటర్స్‌కు టార్గెట్‌గా మారింది సమంత. ఆ సాంగ్‌లో ఆమె లుక్స్ వారిని ఇబ్బందిపెట్టింది. అంత సెక్సీగా కనిపించడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టినీ మరింతగా ఆకర్షిస్తోంది.
Also read: హర్టయిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్.. ఫ్యాన్స్‌కు సారీ!
ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అల్లు అర్జున్‌తో తను ఆడుతోన్న "ఊ అంటావా మావా" పాట స్టిల్‌ను షేర్ చేసిన సమంత, "నేను మంచిదానిగా నటించాను, చెడ్డదానిగా నటించాను, ఫన్నీగా చేశాను, సీరియస్‌గా చేశాను, నేను చాట్ షో హోస్ట్‌గా కూడా చేశాను. నేను టేకప్ చేసే పత్రిదానిలో రాణించడానికి చాలా కష్టపడతాను. కానీ సెక్సీగా ఉండటం అనేది ఇంకో లెవల్ కష్టతరమైన పని. #ooantavaooooantava Thankyou for the love" అని ఆమె రాసుకొచ్చింది. అంటే సెక్సీగా కనిపించడాన్ని తను పాజిటివ్‌గా చూస్తానని డైరెక్టుగానే చెప్పేసిందన్న మాట. మరి సమంత హేటర్స్ ఏం చేస్తారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



