'పుష్ప'కి వస్తున్న రెస్పాన్స్ పై 'అక్షయ్ కుమార్' రియాక్షన్
on Dec 22, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'పుష్ప ది రైజ్'. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీలోనూ అంచనాలకు మించి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. పుష్పకి వస్తున్న రెస్పాన్స్ పై టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేరిపోయాడు.
ట్విట్టర్ లో 'పుష్ప ది రైజ్' ట్రైలర్ ను షేర్ చేసిన అక్షయ్ కుమార్ పుష్పకి వస్తున్న రెస్పాన్స్ పై సంతోషం వ్యక్తం చేశారు. "ఇండియా వైడ్ గా పుష్ప మూవీకి వస్తున్న భారీ రెస్పాన్స్ కి కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్. మన ఇండస్ట్రీ మరో పెద్ద హిట్ ని అందుకుంది. త్వరలోనే పుష్ప మూవీని చూస్తాను" అని అక్షయ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
Also Read