పెద్దిలో జాన్వీకపూర్ కి డూప్ ని పెట్టారా!.. బాంధవి శ్రీధర్ ఎవరు
on Nov 26, 2025

పెద్ది పై భారీ అంచనాలు
జాన్వీ కపూర్ ఏం చేస్తుంది
బాంధవి శ్రీధర్ ఎవరు
తన కెరీర్ కి ప్లస్ అవుతుందా!
సిల్వర్ స్క్రీన్ పై పెద్ది(Peddi),అచ్చాయమ్మ లు అభిమానుల్ని, ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యబోతున్న విషయం కన్ఫార్మ్ అయిపోయింది. చికిరి చికిరి సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుండటమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)పెద్దికి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని చరణ్ ఈ సారి భారీ హిట్ ని అందుకోవడం ఖాయమనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
రీసెంట్ గా మరోన్యూస్ కూడా ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor)క్యారక్టర్ కి సంబంధించిన కొన్నిసన్నివేశాల్లో ప్రముఖ హీరోయిన్ 'బాంధవి శ్రీధర్' జాన్వీ కి డూప్‌గా కనిపించనుంది. ఇద్దరి హైట్ సమానంగా ఉండటంతో పాటు లుక్స్ దగ్గరగా ఉండటంతో మేకర్స్ బాంధవిని డూప్ గా సెలెక్ట్ చేసారు. జాన్వీ తరచు ముంబయి నుంచి లొకేషన్ కి రావాల్సి వస్తుంది. దీంతో ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ స్టే, మేకప్ టీమ్ వంటి వాటికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. అందుకే జాన్వీ కి డూప్ గా బాంధవిని తీసుకున్నారనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై పెద్ది యూనిట్ అధికారికంగా స్పందించలేదు. నిజం చెప్పాలంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భారీ నిర్మాణంతో తెరకెక్కే చాలా సినిమాల్లో ఫేస్ చూపించే అవసరం లేని కొన్ని షాట్స్ లో డూప్ ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాల్షీట్ సమస్యల సందర్భంలో కూడా ఆ విధంగా చేస్తారు.
also read: దర్శకుడు సంపత్ నంది ఇంట్లో తీవ్ర విషాదం
బాంధవి సినీ కెరీర్ ని చూసుకుంటే 'మసూద' మూవీలో దెయ్యం క్యారక్టర్ లో కనపడి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల్లో కనిపించినా పెద్దగా పేరు రాలేదు. అలాంటిది ‘పెద్ది’లో డూప్‌గా జాన్వీ ప్లేస్ లో చేస్తున్నది నిజమే అయితే ఆమె కెరీర్ కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూవీలో చిన్న క్యారక్టర్ లో కూడా కనిపించనుందనే మరో టాక్ కూడా సర్క్యులేట్ అవుతుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న'పెద్ది'ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ప్రతిభావంతులైన యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 26 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



