దర్శకుడు సంపత్ నంది ఇంట్లో తీవ్ర విషాదం
on Nov 25, 2025

-సంపత్ నంది ఇంట్లో విషాదం
-రచ్చ తో చరణ్ కి సూపర్ హిట్
-ప్రస్తుతం భోగి పనుల్లో బిజీ
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ఆరంజ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత 'రచ్చ'తో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. రచ్చ కి ముందు చాలా పెద్ద పెద్ద దర్శకులే చరణ్ కి కథ చెప్పినా నచ్చలేదు. అసలు ఎలాంటి కథతో సినిమా చెయ్యాలనే మీమాంసలో కూడా మెగా కాంపౌండ్ ఉంది. అలాంటి టైం లో రచ్చ కథ చెప్పి ఒప్పించిన దర్శకుడు 'సంపత్ నంది'(Sampath Nandi). దీన్ని బట్టి రచయితగా, దర్శకుడిగా సంపత్ నంది క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. రచ్చ విజయంతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు.
.
రీసెంట్ గా సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(Nandi Kishtayya)చనిపోయారు, నిన్న రాత్రి మరణించగా పలువురు సినీ ప్రముఖులు సంపత్ నంది కి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు. కిష్టయ్య వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయినట్టుగా తెలుస్తుంది. సంపత్ నంది కెరీర్ విషయానికి వస్తే బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటిమార్ వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. నిర్మాతగాను పలు విభిన్న సినిమాలని అందించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన ఓదెల పార్ట్ 2 సంపత్ కథ, నిర్మాణ సారధ్యంలో వచ్చిందే.
also read: బాహుబలి ఎపిక్ ఓటిటి డేట్ పై రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నాడా!
ప్రస్తుతం 'శర్వానంద్'(Sharwanand)హీరోగా భోగి(Bhogi)అనే కొత్త మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2010 లో 'ఏమైంది ఈ వేళ' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సంపత్ నంది స్వస్థలం తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఓదెల.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



