'NBK111' మూవీ లాంచ్.. చరిత్ర సృష్టించడానికి సై అంటున్న బాలయ్య!
on Nov 26, 2025

వీరసింహారెడ్డి కాంబోలో హిస్టారికల్ ఫిల్మ్
ఘనంగా 'NBK111' మూవీ లాంచ్
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హవా నడుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకున్నారు. డిసెంబర్ 5న 'అఖండ-2'తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే ఉత్సాహంతో తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.
బాలకృష్ణ తన 111వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వీరసింహారెడ్డి వంటి ఘన విజయం తర్వాత బాలయ్య-మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్.
Also Read: నీ ప్రేమ నాకు మళ్ళీ కావాలి.. కంటతడి పెట్టిస్తున్న సంపత్ నంది పోస్ట్!
'NBK111' మూవీ లాంచ్ బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ టీంతో పాటు ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ కొల్లి, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.
మూవీ ఓపెనింగ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. రాజు గెటప్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



