ఎన్టీఆర్ జయంతికి దర్శకేంద్రుడి కీలక ప్రకటన
on May 28, 2020
వేటగాడు...
అడవిరాముడు...
సింహ బాలుడు...
డ్రైవర్ రాముడు...
మేజర్ చంద్రకాంత్... నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా వీళ్లిద్దరి కాంబినేషన్ నిలిచింది. ఎన్టీఆర్ సహా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు అగ్ర హీరోలతో రాఘవేంద్రరావు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తరవాత తరం హీరోలతోనూ పని చేశారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. తన సినిమా ప్రయాణంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నప్పటికీ... లెజెండరీ ఎన్టీఆర్ గారితో పని చేసే అవకాశం రావడం అన్నిటికంటే ఉన్నతమైనదని రాఘవేంద్రరావు అన్నారు.
గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహనీయుడిని స్మరించుకున్న దర్శకేంద్రులు తన తదుపరి సినిమాపై కీలక ప్రకటన చేశారు. "గత ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇదే రోజున నేను ఒక సినిమా ప్రకటించాను. ఆ సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రేక్షకులు అందరినీ కొత్త విధానంలో ఎంటర్టైన్ చేస్తాను" అని రాఘవేంద్రరావు తెలిపారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
