సింప్లిసిటీ అంటే అదీ.. వైరల్ అవుతున్న బాలకృష్ణ వీడియో!
on Jul 18, 2024
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు విమాన ప్రయాణం చేసేటపుడు టాప్ సర్వీస్ లెవల్స్ అయిన బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్‌లను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఆ లెవల్స్‌లో వారికి ప్రైవసీ ఎక్కువగా ఉంటుందని వారి ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే కొందరు హీరోలు, హీరోయిన్లకు సొంత ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో ఏ సర్వీస్ లెవల్‌లో ప్రయాణం చెయ్యాలి? అందరిలాగే బిజినెస్ లేదా ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ, దానికి భిన్నంగా ఎకానమీ లెవల్‌లో ఫ్లైట్ జర్నీ చేసిన బాలయ్య గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేశాడు ఓ నెటిజన్. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ పక్కన కూర్చున్న ఓ కుర్రాడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో బాలయ్య కూడా వచ్చేలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 20 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోలో బాలకృష్ణ ఈ కుర్రాడు తీస్తున్న సెల్ఫీ వీడియోను గమనించలేదు. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయిన తర్వాత నెటిజన్లు ఫన్నీగా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘సింహం పక్క సీట్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసి అప్‌లోడ్ చేసావంటే నీ ఫోన్ ఆయుష్షు మామూలుగా లేదు సోదరా’, ‘నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్.. ఒక్కసారి బాలయ్య చూస్తే నీకు దబిడి దిబిడే’, ‘జస్ట్ మిస్ అయ్యావు.. లేదంటే అంతే’... ఇలా లెక్కకు మించిన కామెంట్స్ ఈ వీడియోకు వస్తున్నాయి. నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
మరో పక్క బాలకృష్ణను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీ అనగానే వారు జర్నీ చేసే సర్వీస్ లెవల్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, బాలయ్య మాత్రం సాధారణ ప్రయాణికులు తీసుకునే ఎకానమి లెవల్‌లో ప్రయాణం చెయ్యడం అందర్నీ ఆకట్టుకుంది. అతని సింప్లిసిటీ గురించి ప్రస్తావిస్తూ బాలయ్యను ప్రశంసిస్తున్నారు. అది తండ్రి నుంచి అలవరుచుకున్న లక్షణమని కొందరు పొగుడుతున్నారు.
Also Read