సాయి పల్లవి పార్టీ ఎప్పుడు ఇస్తుంది.. ఆరు చాలవా ఇంకా కావాలా!
on Jul 18, 2024
హీరోనే కాదు హీరోయిన్ కూడా సినిమాకి చాలా ముఖ్యమని నిరూపించే హీరోయిన్లు చాలా అరుదుగా పుట్టు కొస్తుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు సాయి పల్లవి(sai pallavi)ఫిదా తో అందరి మనసులని ఫిదా చేసిన సాయి పల్లవి తాజాగా ఒక అరుదైన ఘనతని సాధించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన ఆమె స్థాయిని తెలియజేస్తుంది.
సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్..ఎనీ ఆర్టిస్ట్ ఈ అవార్డుని అందుకోవడం చాలా గొప్పగా భావిస్తారు. ఎంతో గౌరవప్రదమైనది కూడా. రీసెంట్ గా 68వ ఫిలింఫేర్ అవార్డ్స్ జాబితా వచ్చింది. సాయి పల్లవి ఒకే సారి రెండు చిత్రాలకి విమర్శకుల కోటాలో ఉత్తమ నటి అవార్జుని గెలుచుకుంది. గార్గి(gargi)విరాట పర్వం (virataparvam)కి గాను ఈ ఘనతని సాధించింది. దీంతో తండేల్ మూవీ టీం తమ సంతోషాన్ని తెలియచేస్తు సాయి పల్లవి ని సత్కరించింది. ఆ తర్వాత కేక్ కూడా కట్ చేయించింది. తండేల్ (thandel)నిర్మాత అల్లు అరవింద్(allu aravind)దగ్గరుండి మరి కేక్ కట్ చేయించి తినిపించాడు.
ఇక ఈ అవార్డులతో సాయి పల్లవి అందుకున్న ఫిలిం ఫేర్ అవార్డ్స్ సంఖ్య ఆరుకి చేరింది. ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తన కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని పద్దెనిమిది సినిమాలు దాకా మాత్రమే చేసింది. వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా క్యారక్టర్ నచ్చి సదరు క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తుంది. అందుకే ఇప్పుడు వరుస పెట్టి అవార్డ్స్ ని గెలుచుకుంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే పార్టీ లేదా సాయి పల్లవి అని అంటున్నారు.
Also Read