రామ్ చరణ్, దిల్ రాజుకి నో ఎంట్రీ.. శంకర్ సార్ మీరు మారాలేమో!
on Jul 18, 2024
మూవీ లవర్స్ అప్ డేట్ కానీ రోజుల్లోనే దర్శకుడు శంకర్( shankar)జెంటిల్ మెన్, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు లాంటి అప్ డేట్ సినిమాలని తెరకెక్కించాడు. ఆయా సినిమాల కథ, కథనాలు చాలా వేగంగా సాగి ఒక్క నిమిషం కూడా కళ్ళు పక్కకు తిప్పి చూడలేని విధంగా సాగుతాయి. మరి అలాంటి శంకర్ కి ఏమైంది అనే డౌట్ భారతీయుడు 2 రాకతో అందరిలో మొదలయ్యింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ మూవీ అన్ని చోట్ల కూడా ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అంతటితో ఆగకుండా పైన చెప్పుకున్న విధంగా శంకర్ కి ఏమైందనే చర్చ అందరిలో మొదలయ్యింది. ఇప్పుడు ఇంకో నయా చర్చ కూడా మొదలయ్యింది. చరణ్, దిల్ రాజు మీద శంకర్ కూసంత కరుణ రసాన్ని చూపించాలని అంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)అండ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్(game changer)దిల్ రాజు(dil raju)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. పైగా ఆయన ఇప్పటి వరకు నిర్మించిన అన్ని సినిమాల కంటే ఇదే హయ్యెస్ట్ బడ్జట్ మూవీ. చరణ్ కెరీర్ కి కూడా ఇదే మోస్ట్ మెమొరీబిల్ ప్రాజెక్ట్.గా కూడా భావించవచ్చు. పైగా శంకర్ ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. దీన్ని బట్టి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక కారణాలు ఏమైనా కావచ్చు గాని గేమ్ చేంజర్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చెన్నై లో ఎప్పటినుంచో జరుగుతుంది. అదేంటి మూవీ ఇంకో పది పదిహేను రోజులు షూట్ ఉంది కదా అని అనుకుంటున్నారా! మీరు అనుకునేది నిజమే. కాకపోతే ఇప్పటి వరకు పూర్తయిన భాగానికి ఎడిట్ సూట్ జరుగుతుంది. ఇది పూర్తిగా శంకర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇక్కడికి ఇంతవరకు చరణ్ గాని దిల్ రాజు గాని అడుగుపెట్టలేదు. అడుగుపెట్టలేదనుకోవడం కంటే శంకర్ ఆ ఇద్దరకీ యాక్సెస్ ఇవ్వలేదని కూడా భావించవచ్చు. శంకర్ అన్ని సినిమాలకి కూడా ఈ విధంగానే జరుగుతుంది.
కానీ ఇప్పుడు భారతీయుడు 2 (bharatheeyudu 2)ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూవీలో ఏ సీన్ కి ఆ సీన్ బాగానే ఉన్నా కూడా లింక్ ల్లో ఉన్న కొన్ని తేడాల వల్ల ప్రేక్షకులని రంజింప చేయలేక పోయింది. మరి ఇప్పుడు శంకర్ ఒక్కడే గేమ్ చేంజర్ ఎడిట్ సూట్ లో ఉండకుండా అనుభజ్ఞుడైన దిల్ రాజు, ఆస్కార్ ని సాధించిన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాలో చేసిన రామ్ చరణ్ ని ఎడిట్ సూట్ లో కూర్చోబెడితే గేమ్ చేంజర్ కి ఎంతో ఉపయోగం. ముఖ్యంగా శంకర్ కి చాలా ఉపయోగం. ఎందుకంటే ఎంత పెద్ద సీనియారిటీ దర్శకుడు అయినా కూడా ఇక్కడ హిట్ లు మాత్రమే కొలమానం. అవి మాత్రమే మాట్లాడతాయి. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు కాగా థమన్(thaman)మ్యూజిక్ డైరెక్టర్.
Also Read