పోలీస్ స్టేషన్లో పూరీ జగన్నాథ్..!
on Apr 14, 2016

పూరీ జగన్నాథ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కారణం ఎవరికీ తెలియదు. విషయం మాత్రం మీడియా వారికి లీకైంది. దీంతో మొత్తం టీవీజనమంతా కేమేరాలు వేసుకుని బంజారా హిల్స్ పిఎస్ మీద పడ్డారు. ఏదో సెన్సేషనల్ న్యూస్ అండ్ విజువల్స్ దొరుకుతాయని ఆశపడ్డ వాళ్లందరి ఆశల మీద పూరీ జగన్నాథ్ సింపుల్ గా నీళ్లు చల్లేశారు. ఎసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తన ఫ్రెండ్ అని, ఆయన్ను కలవడానికి వచ్చానని పూరీ చెప్పేసరికి, సమ్మర్ వేడిలో కూడా చెమటలు కార్చుకుంటూ పిఎస్ కు ఉరుకులు పరుగులు పెట్టిన కెమేరాలన్నీ, ఉస్సూరుమని పిఎస్ బయటికొచ్చాయి. కానీ తప్పదు మరి. అసలే ఫ్యామస్ డైరెక్టరాయే. ఆయన కోసం ఆ మాత్రం చెమటలు పట్టినా తప్పులేదులే అని సరిపెట్టుకున్నారు పాపం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



