ద్యేవ్‌డా.. బన్నీ ఖాతాలో చెత్తరికార్డ్!
on Feb 28, 2017
సోషల్ మీడియాలో తనకు తిరుగులేదన్నది అల్లు అర్జున్ నమ్మకం. అది నిజమే. ఎందుకంటే... ట్విట్టర్‌లో ఓ సౌత్ ఇండియన్ హీరోకీ లేనంత మంది ఫాలోవర్స్ ఉన్నారు బన్నీకి. సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఏ వార్త అయినా హాట్ హాట్‌గా చలామణీ అయిపోతుంటుంది. అలాంటి బన్నీకి సోషల్ మీడియాలోనే గట్టి షాక్ తగిలింది. తన కెరీర్‌లోనే చెత్త రికార్డు బన్నీ వశమైంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ఇటీవలే విడుదలైంది.
ఈ టీజర్ వచ్చినప్పటి నుంచీ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. టీజర్ బాగానే ఉన్నా.. కావాలని కొంతమంది దురాభిమానులు ఈ టీజర్‌కి డిజ్ లైకులు కొడుతూ అప్రతిష్ట పాలు చేస్తున్నారని బన్నీ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తూ వచ్చారు. బన్నీ టీజర్‌ని దాదాపు 50 లక్షలమంది వీక్షించారు. ఆ అంకెలకంటే కింద ఉన్న లైక్‌లూ, డిజ్ లైక్‌లపైనే అందరి దృష్టీ పడింది. లైక్‌లు లక్ష ఉంటే.. దానికి సమానంగా డిజ్ లైకులు కూడా వచ్చాయి.
ఓ స్టార్ హీరో టీజర్‌కి ఇన్ని డిజ్ లైకులు రావడం ఇదే తొలిసారి. అజిత్ నటించిన వేదాళం టీజర్‌కి 70 వేలకు పైగా డిజ్ లైక్‌లు వచ్చాయి. సౌతిండియాలో అదే చెత్త రికార్డ్. దాన్ని బన్నీ బద్దలు కొట్టాడన్నమాట. అయితే అన్ని డిజ్ లైకులు వచ్చినా వేదాళం హిట్టయ్యింది. ఇప్పుడు బన్నీ... కూడా తన సినిమాని హిట్ చేసుకొంటాడా?? అనేది ఆసక్తి గా మారింది. మొత్తానికి ఈ లైక్‌లు, డిజ్ లైకుల పోరులో బన్నీ యాంటీ అభిమానులు గెలిచారు. ఇది బన్నీ ఫ్యాన్స్‌కి మింగుడు పడని విషయమే.