'బ్రోచేవారెవరురా' డైరెక్టర్ ఓ ఇంటివాడయ్యాడు!
on Dec 19, 2020
శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాలను రూపొందించి, టాలెంటెడ్ డైరెక్టర్‌గా విమర్శకుల, ఇండస్ట్రీ వర్గాల ప్రశంసలు అందుకున్న వివేక్ ఆత్రేయ ఓ ఇంటివాడయ్యాడు. ఇటీవల తన స్వీట్‌హార్ట్ శ్రీజ గౌని మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను 'బ్రోచేవారెవరురా' హీరోయిన్ నివేదా థామస్ షేర్ చేసింది. ఆ పిక్చర్స్‌లో వధూవరులతో పాటు శ్రీవిష్ణు దంపతులు, నివేదా థామస్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు, నివేదా సోదరుడు నిఖిల్ థామస్ కూడా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ పెళ్లి వేడుకలో నివేదా సందడి బాగానే చేసినట్లు ఆ పిక్చర్స్ తెలియజేస్తున్నాయి.
మరో ఫొటోలో వధూవరులు శ్రీవిష్ణు దంపతుల ఆశీర్వాదాలు తీసుకోవడం కనిపిస్తోంది. అలాగో మరో ఫొటోలో పెళ్లికొడుకును చేస్తున్నప్పటి దృశ్యాన్ని చూడొచ్చు. అందులో వివేక్ పక్కన ఒక బుడ్డ తోడి పెళ్లికొడుకు కూడా కనిపిస్తున్నాడు.
నాని హీరోగా త్వరలో 'అంటే సుందరానికీ..' చిత్రాన్ని రూపొందించనున్నాడు వివేక్ ఆత్రేయ. ఇందులో మలయాళం తార నజ్రియా ఫహాద్ (నజ్రియా నజీమ్) నాయికగా నటిస్తోంది.
Also Read