కామెడీ కింగ్ 'వివేక్' చివరి సినిమా 'అంతఃపురం' ట్రైలర్ వచ్చేసింది!
on Dec 20, 2021

హారర్ కామెడీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ ఉంటారు. పలు తమిళ హారర్ కామెడీ సినిమాలు సైతం తెలుగులో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. అందులో 'అరణ్మణై' సిరీస్ ఒకటి. తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైన 'అరణ్మణై', 'కళావతి'గా విడుదలైన 'అరణ్మణై 2' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు 'అంతఃపురం' పేరుతో 'అరణ్మణై 3' వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీకి తమిళంలో మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న రాశీ ఖన్నా, ఆర్య ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 'చంద్రకళ', 'కళావతి' సినిమాల మాదిరిగా 'అంతఃపురం' సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

కోలీవుడ్ సీనియర్ కమెడియన్ వివేక్ నటించిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే మరో స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



