నాని కూడా వారి బాటలోనే వెళతాడా!
on Dec 20, 2021

నేచురల్ స్టార్ నాని సక్సెస్ చూసి చాలా కాలమైంది. తన గత మూడు చిత్రాలు `గ్యాంగ్ లీడర్` `వి`, `టక్ జగదీశ్`.. నానికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. వీటిలో `వి`, `టక్ జగదీశ్` ఓటీటీలో స్ట్రీమ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ డిసెంబర్ 24న తన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`తో పలకరించబోతున్నాడు నాని. ఇందులో శ్యామ్ సింగ రాయ్, వాసుగా రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వబోతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ప్రచార చిత్రాలు, పాటలు ఇంప్రెసివ్ గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read:2021 జ్ఞాపకాలుః `జీరో రిలీజ్ ఇయర్` స్టార్స్!
మరోవైపు.. ఫ్లాప్స్ లో ఉన్న పలువురు కథానాయకులకు ఈ ఏడాది థియేట్రికల్ రిలీజెస్ అచ్చొచ్చిన వైనం కూడా `శ్యామ్ సింగ రాయ్`పై పాజిటివ్ వైబ్స్ పెంచుతోంది. `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటోని`, `డిస్కో రాజా`తో గతంలో వరుస పరాజయాలు చూసిన మాస్ మహారాజా రవితేజకి `క్రాక్`తోనూ.. `సర్దార్ గబ్బర్ సింగ్`, `కాటమ రాయుడు`, `అజ్ఞాతవాసి`తో ట్రాక్ తప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి`వకీల్ సాబ్`తోనూ.. `సుడిగాడు` నుంచి కథానాయకుడిగా సరైన విజయం లేని `అల్లరి` నరేశ్ కి `నాంది` రూపంలోనూ.. `లౌక్యం` తరువాత విజయాల్లేని గోపీచంద్ కి `సీటీమార్` రూపంలో.. అదేవిధంగా `యన్టీఆర్` బయోపిక్, `రూలర్`తో ట్రాక్ తప్పిన నటసింహం నందమూరి బాలకృష్ణకి `అఖండ`తోనూ మంచి విజయాలు దక్కడం చూస్తే.. ప్రామిసింగ్ గా ఉన్న `శ్యామ్ సింగ రాయ్`తోనూ నాని కూడా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
మరి.. నాని కూడా వారి బాటలోనే వెళ్ళి 2021 క్యాలెండర్ ఇయర్ కి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



