"లయన్‌లా ఉన్నావ్ నాన్నా".. నానికి కొడుకు కితాబు! వైరల్ వీడియో!!
on Dec 20, 2021

నాని డిసెంబర్ 24న 'శ్యామ్ సింగ రాయ్'గా వస్తున్నాడు మనముందుకు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథలో టైటిల్ రోల్‌లో నాని నటించాడు. ఈ క్యారెక్టర్‌లో అతను మెలితిప్పిన మీసాలతో కనిపించనున్నాడు. ఇప్పటికీ ఆ ఆహార్యాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా కొడుకు అర్జున్‌తో కలిసున్న ఈ వీడియో క్లిప్‌ను నాని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు.
అందులో నాని బెడ్ మీద పడుకొని ఉంటే, అతని ఛాతీపైన కూర్చొని నాన్న మీసాలతో ఆడుకుంటున్నాడు అర్జున్.
కొడుకు అలా చేస్తుంటే, "నా పేరేంటో తెలుసా?" అనడిగాడు నాని.
"ఊ.." అన్నాడు అర్జున్.
"ఏంటి?" అనడిగాడు నాని.
"శ్యామ్ సింగ రాయ్." అని చెప్పాడు అర్జున్.
"యస్. శ్యామ్ సింగ రాయ్." అన్నాడు నాని.
"లయన్‌లా ఉన్నావ్ నాన్నా.. ఇట్లా పెడితే.." అని మళ్లీ నాన్న మీసాలను మెలితిప్పాడు అర్జున్.
"అవునా!" అని మురిసిపోయాడు నాని.
ఇప్పటికే 'శ్యామ్ సింగ రాయ్'కు సంబంధించి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇన్‌స్టంట్ హిట్టయ్యాయి. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవి కన్నీళ్లు తిరుగుతుండగా, చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది. ఆమె ఎందుకంత ఎమోషనల్‌గా అయ్యిందో ఈ నెల 24న సినిమా విడుదలయినప్పుడు అర్థమవుతుందని చెప్పాడు నాని. అనేక అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



