తమ్ముడికి భయం "అక్క"ర్లేదట..!
on Dec 16, 2016
.jpg)
సాధారణంగా హీరోయిన్లు తమ చెల్లెళ్లని కూడా వెండితెరకు పరిచయం చేస్తుంటారు. నాటి నుంచి నేటి వరకు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే జరిగింది..కరిష్మాకపూర్..కరీనాకపూర్, నగ్మా-జ్యోతిక, ఆర్తి అగర్వాల్-అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్ ఇలా ఎన్నో ఉదాహరణలు మనముందు కనిపిస్తాయి. కానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వీరందరికి కాస్త వెరైటిగా ట్రై చేస్తోంది..ఆమె తన తమ్ముడిని సినిమాల్లోకి తీసుకురావాలని పెద్ద ప్లాన్ గీస్తోంది. అది కూడా తెలుగు సినిమా ద్వారానే హీరోగా ఎంట్రీ ఇప్పించాలని అనుకుంటోందట రకుల్. అందుకే తెలుగులో మాట్లాడటం కూడా తమ్ముడికి నేర్పించేసిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది రకుల్ తమ్ముడి ఏంట్రీ జరగవచ్చని టాలీవుడ్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



