పాపం... హీరోయిన్ పెళ్లి పెటాకులైంది
on Dec 10, 2019
'కొత్త బంగారు లోకం' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందా? తెలుగులో తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత సరైన ప్లానింగ్ లేక పైకి ఎదగలేదు. మంచి ఆర్టిస్ట్. టాలెంటెడ్ హీరోయినే. కానీ అదృష్టం ఆమెకు కలిసి రాలేదు. వ్యభిచార ఆరోపణలు రావడంతో హీరోయిన్ కెరీర్ నాశనం అయింది. మళ్ళీ కోలుకుని వెబ్ సిరీస్, సినిమాలు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలో మళ్ళీ ఆమె జీవితంలో ఓ కుదుపు. తొలి వివాహ వార్షికోత్సవానికి మూడు రోజుల ముందు విడాకులు తీసుకుంటున్నట్టు శ్వేతాబసు ప్రసాద్ ప్రకటించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిత్ మిట్టల్, శ్వేతాబసు ప్రసాద్ విడిపోతున్నారు. కొన్ని నెలల క్రితమే తాము వేరుపడాలని నిర్ణయించుకున్నట్టు శ్వేతాబసు ప్రసాద్ తెలిపారు. రోహిత్ కు ఆమె థాంక్స్ చెప్పారు. ఎప్పటికి మరువలేని జ్ఞాపకాలను ఇచ్చినందుకు, ఎప్పుడూ తనలో స్ఫూర్తి నింపినందుకు థాంక్స్ చెప్పారు. ఎప్పటికి రోహిత్ కి తానొక చీర్ లీడర్ లా ఉంటానని ఆమె అన్నారు. ఆమె పోస్ట్ చూసి... పాపం అనుకునే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువుంది.
Also Read