ప్రభాస్, మహేష్... తర్వాత అల్లు అర్జునే!
on Sep 19, 2023
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్‌ది ఒక డిఫరెంట్ స్టైల్. అతను కామెడీ చేసినా, యాక్షన్ సీక్వెన్స్ చేసినా అన్నీ డిఫరెంటే. అలాంటి డిఫరెంట్ ఆర్టిస్టుకి ‘పుష్ప’లాంటి సినిమా వస్తే.. ఇంకేముందు అన్నీ ప్రశంసలే, అవార్డుల పంటే. ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కి ఇప్పుడు ఓ అరుదైన గౌరవం లభించబోతోంది. లండన్‌లో మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ ఎందరో ప్రముఖ వ్యక్తుల మైనపు రూపాల్లో కొలువై ఉన్నారు. ఇప్పుడు వారి సరసన అల్లు అర్జున్ కూడా చేరబోతున్నాడు.
మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖుల మైనపు ప్రతిమలను తయారు చేసి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే భారతదేశానికి చెందిన ఎందరో ప్రముఖుల మైనపు ప్రతిమలు అక్కడ ఉన్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్, మహేష్‌ల మైనపు ప్రతిమలు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌కి అక్కడి నుంచి పిలుపు వచ్చింది వెంటనే వచ్చి కొలతలు ఇవ్వమని. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్ని త్వరలోనే రెండు రోజులు గ్యాప్ తీసుకొని లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్ళి అక్కడి మైనపు ప్రతిమలను సందర్శించి, తన శరీర కొలతలు ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ మైనపు ప్రతిమను వచ్చే ఏడాది చూసేందుకు సిద్ధం చేయనున్నారు.
Also Read