సలార్ ట్రైలర్.. ఎప్పుడో తెలుసా!
on Sep 19, 2023
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఈ నెల 28న 'సలార్' మొదటి భాగం తెరపైకి వచ్చేది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఈ వాయిదా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. బహుశా.. ఈ ఏడాది దీపావళి స్పెషల్ గా గానీ లేదా 2024 సంక్రాంతికి గానీ 'సలార్' సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే, సలార్ ట్రైలర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న సలార్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారట. అదే గనుక నిజమైతే.. దీపావళికి సలార్ ఆగమనంకి అవకాశమున్నట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో.
కాగా, సలార్ లో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ఎంటర్టైన్ చేయనుంది.
Also Read