విజయ్ కూతురు పోస్టుమార్టం రిపోర్ట్.. వైద్యులు ఏం చెప్పారంటే..
on Sep 19, 2023
సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోని కూతురు మీరా (16).. ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అనూహ్య ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. చదువుల ఒత్తిడి కారణంగానే.. గత కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్న మీరా సూసైడ్ చేసుకుందని సమాచారం.
ఇదిలా ఉంటే, విజయ్ ఆంటోని కుమార్తె మీరా మృతదేహానికి చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వాసుప్రతిలో పోస్టుమార్టం జరుగుతున్న విషయం విదితమే. కొద్దిసేపటి క్రితమే పోస్టుమార్టం పూర్తయింది. మీరాది ఆత్మహత్యగా నిర్దారిస్తూ వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కాగా, రేపు (బుధవారం) మీరా అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read