అవసరమైతే సొంతంగా వస్తా...సంక్రాంతి మాత్రం ఫిక్స్ !
on Dec 23, 2023
కింగ్ నాగార్జున నుంచి వస్తున్న నయా మూవీ నా సామి రంగ.. సంక్రాంతి బరిలో దిగడానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ ముమ్మరం చేసారు. అందులో భాగంగా ఇటీవలే నాగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కలిసి ఉన్న టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. నాగ్ అభిమానుల్లో సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ మూవీకి ఇప్పుడు ఒక సమస్య వెంటాడుతుంది.
నాగార్జున తన నా సామి రంగ మూవీ షూటింగ్ ఓపెనింగ్ నుంచే 2024 సంక్రాంతికి రావాలనే పట్టుదలతోనే ఆ మూవీని ప్రారంభించారు. ఇప్పుడు నా సామి రంగ కి థియేటర్స్ సమస్య వచ్చి పడింది. సంక్రాంతికి వస్తున్న కొన్ని సినిమాలకి ఆల్రెడీ థియేటర్స్ లాక్ అయ్యి ఉండటంతో నాగ్ సినిమాకి థియేటర్స్ దొరకడం లేదు. ఈ విషయంలో నాగార్జున చాలా అసంతృప్తితో ఉన్నాడనే టాక్ బయట వినపడుతుంది.
కానీ ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి రావలసిందే అని నాగ్ ఫిక్స్ అవ్వడంతో చిత్ర నిర్మాత థియేటర్స్ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నారు. అవసరమైతే తన సొంత డిస్ట్రిబ్యూషన్ అన్నపూర్ణ ద్వారా అయినా సొంతంగా రిలీజ్ చెయ్యాలనే పట్టుదలతో నాగ్ ఉన్నాడు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ ని దర్శకుడుగా పరిచయం చేస్తు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీలో నాగ్ సరసన ఆషిక రంగనాధ్ హీరోయిన్ గా చేస్తుంది.అలాగే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read