నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను.. ఎవరో కూడా చెప్పిన యానిమల్ నటి త్రిప్తి
on Dec 23, 2023
యానిమల్ అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ గా మారిన నటి త్రిప్తి దిమ్రి. ఆ సినిమాలో ఎలాంటి బెదురు లేకుండా బోల్డ్ గా నటించి ఇండియన్ సినిమా మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది. అలాగే ఆ మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రష్మిక కంటే త్రిప్తి కే ఎక్కువ పేరు వచ్చిందంటే ఆమె సృష్టించిన సంచలనం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాగే యానిమల్ విజయంతో వరుస ఇంటర్వ్యూ ల్లో బిజీగా ఉన్న త్రిప్తి ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
యానిమల్ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపుతో త్రిప్తి కి డైలీ లెక్కకు మించిన ఫోన్స్ వస్తున్నాయి. అలాగే పగలు రాత్రి అనే తేడా లేకుండా మెసేజ్ లు కూడా వస్తున్నాయి. అలా వచ్చిన వాటికి రిప్లై ఇచ్చే పనిలో చాలా రోజుల నుంచి నిద్రలేని రాత్రులుని గడుపుతున్నాను. కానీ అభిమానులు నా మీద చూపిస్తున్న ప్రేమకి మాత్రం చాలా సంతోషంగా ఉందంటు త్రిప్తి చెప్పుకొచ్చింది.
అలాగే రణబీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్ నన్ను చాలా సపోర్ట్ చేసారు. అలాగే రష్మిక కూడా నన్ను నటన విషయంలో చాలా ఎంకరేజ్ చేసింది అని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఒక్కటి మాత్రం పక్కగా నిజం త్రిప్తి ఇక ఏ సినిమాలో కనపడితే ఇక ఆ సినిమా ఆడే థియేటర్ ముందు ఆమె అభిమానులు క్యూ కట్టడం మాత్రం గ్యారంటీ.
Also Read