13 ఏళ్లకే తమన్నా మొదలెట్టేసిందట
on Jun 14, 2016
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.... తెలుగు హీరోయిన్లలో నన్ను బెస్ట్ డ్యాన్సర్ అంటారనే కాంప్లిమెంట్‌కి థ్యాంక్స్. నేను డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకోలేదు. 13 ఏళ్లకే నా సినిమా జీవితం ప్రారంభించా.దాంతో అంత టైమ్ దొరకలేదు. షూటింగ్ టైమ్‌లో కొరియోగ్రాఫర్స్ చెప్పినట్టు అక్కడికక్కడ చేసేయడమే. విచిత్రమేమిటంటే... అంత చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేసినా నా గురించి నేను ఆలోచించుకుంటే... చిన్నప్పుడే చాలా క్లారిటీగా ఉన్నాననిపిస్తుంది. అప్పు డు సినిమా చేయాలి అంతే. ఇంకేం తెలీదు. స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఒకటే థాట్ ఉండేది. అంతే కాకుండా సినీ రంగంలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నాకు ముగ్గురు పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు. బ్యాలెన్స్‌డ్ డైట్, టైమింగ్ డిసిప్లిన్ వంటి విషయాల్లో కచ్చితంగా ఉంటాను. ఇప్పటి అమ్మాయిలకు నేను చెప్పే ఫిట్‌నెస్ టిప్ ఒకటే... మీకు ఏది ఇష్టముంటే అది తినండి. యోగా కావచ్చు... జిమ్‌కి వెళ్లవ చ్చు... స్పోర్ట్స్ ఆడవచ్చు. ఏదైనా సరే రోజుకో గంట శారీరక శ్రమ అవసరం. తినమన్నా కదాని ఎంత పడితే అంత తినడం కాదు. మీ ఫిట్‌నెస్‌ని నిర్ణయించేది 70 శాతం డైట్ అయితే... 30 శాతం వర్కవుట్ అని గుర్తుంచుకోండి.