షాకింగ్ : మారుతితో అఖిల్??
on Aug 11, 2016
టాలీవుడ్‌లో మరో షాకింగ్ కాంబినేషన్.. రాబోతోంది. బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకొని, ఆ తరవాత క్లీన్ కామెడీ బాట పట్టిన మారుతితో అఖిల్ జత కట్టబోతున్నాడన్నది టాలీవుడ్ టాక్. అఖిల్ రెండో సినిమా ఇంకా మొదల్వలేదు. కథల ఎంపిక కోసం తర్జన భర్జన పడుతున్నాడు అఖిల్. వంశీ పైడి పల్లితో ఓ సినిమా చేద్దామనుకొన్నాడు అఖిల్. అయితే ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండడంతో హను రాఘవపూడి చెప్పిన కథకు ఓకే చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సరైన నిర్మాత దొరక్కపోవంతో అదీ లేటయ్యేలా కనిపించింది. దాంతో హను ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు అఖిల్‌కి అర్జెంటుగా దర్శకుడు కావాల్సివచ్చింది. ఇప్పుడు అఖిల్ దృష్టి మారుతిపై పడినట్టు టాక్. మారుతి ఓ వైవిధ్యభరితమైన కథ చెప్పి అఖిల్‌ని లాక్ చేసినట్టు టాక్. మారుతితో సినిమా చేయడానికి అఖిల్ కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే బాబు బంగారం రిజల్ట్ చూసి అప్పుడు తన నిర్ణయాన్ని చెబుతానన్నాడట అఖిల్. మారుతి దర్శకత్వం వహించిన బాబు బంగారం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ఫలితంపైనే మారుతి - అఖిల్‌ల క్రేజీ కాంబినేషన్ ఆధార పడి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



