ఆ హీరో కాపురంలో చిచ్చు పెట్టిన నిత్యామీనన్
on Aug 11, 2016

వెండితెరపై పద్ధతైన పాత్రలు చేస్తూ.. పేరు తెచ్చుకొంది నిత్యామీనన్. మన పక్కింటి అమ్మాయిలాంటి పాత్రల్లో ఆకట్టుకొని... అందరి అభిమానాన్ని సంపాదించుకొంది. అయితే.. సెట్లో నిత్యా ప్రవర్తన, తన టెంపర్ భరించలేనంతగా ఉంటుందని టాక్. నిత్యాపై పుట్టుకొచ్చిన గాసిప్పులకు లెక్కేలేదు. అందులో లవ్ ఎఫైర్లూ ఉన్నాయి. తాజాగా నిత్యా సల్మాన్ దుల్కర్‌తో ప్రేమలో పడిందని టాక్. సల్మాన్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. పెళ్లయిన వాడితో నిత్యా ప్రేమ వ్యవహారం నడపడం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్లిద్దరూ కలసి ఇప్పటి వరకూ మూడు సినిమాల్లో నటించారు. ఆ మూడు చిత్రాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ సూపర్‌గా కుదిరింది. అందుకే బయట కూడా అంతే ఇదిగా మూవ్ అవుతున్నారని టాక్. నిత్యా వల్ల సల్మాన్ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయని, ఓ హీరో కాపురంలో నిత్యా నిప్పులు పోసిందని... తమిళ సినీ వర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. అయితే ఈ మాట ఆనోటా.. ఈనోటా నిత్యాకు కూడా తెలిసింది. ''నా గురించి ఎవరేం అనుకొన్నా లెక్కలేదు. ఇలా నేను పనిచేసిన హీరోలందరితోనూ నాకు లింకులు పెట్టడం మామూలే. దీన్ని నేను పెద్ద సీరియస్‌గా తీసుకోను'' అంటోంది నిత్యా. అంటే... దుల్కర్‌లో దోస్తీ ఉన్నట్టా, లేదా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



