శంకర్ దాదా మళ్లీ వస్తున్నాడహో...
on Aug 11, 2016

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన మున్నాభాయ్ సిరీస్‌ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత లగేరహో మున్నాభాయ్‌ని.. శంకర్ దాదా జిందాబాద్‌గా తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా తెలుగు నాట శంకర్ దాదా బ్రాండ్ అలానే ఉంది. ఇప్పుడు బాలీవుడ్‌లో మున్నాభాయ్ 3కి రంగం సిద్ధం అవుతోంది. సంజయ్ దత్, అర్షద్ వార్శీ కలసి నటించబోతున్నారు. ఆల్రెడీ స్క్రిప్టు పనులు కూడా పూర్తయ్యాయి. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమా కూడా బాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అప్పుడే లెక్కలు కట్టేస్తున్నారు. ఒకవేళ మున్నాభాయ్ మూడో భాగం కూడా హిట్టయితే.. దాన్ని టాలీవుడ్‌లో రీమేక్ చేయడం ఖాయం. అదీ.. చిరంజీవి చేతికే చిక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్నాభాయ్ పట్టాలెక్కకముందే ఆ రీమేక్ రైట్స్ చేజిక్కించుకోవాలని చిరు అండ్ కో ప్రయత్నించినా ప్రయత్నించొచ్చు. సో.. చిరు చేయాల్సిన సినిమాల జాబితాలో మరోటి చేరిపోయిందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



