'ఆరాధన' టైటిల్ తో మరో సినిమా.. ఆ ఆరాధనల సరసన నిలబడుతుందా!
on Dec 13, 2021

టాలీవుడ్ లో 'ఆరాధన' టైటిల్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ టైటిల్ తో లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఆరాధన' టైటిల్ తో సినిమా చేశారు. ఇప్పుడిదే టైటిల్ తో టాలీవుడ్ ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాతో పలువురు కొత్తవారు టాలీవుడ్ కి పరిచయం కానుండటం విశేషం.
'ఆర్.వి.జి మూవీస్'తో కలిసి 'రెబెల్ నేషన్' నిర్మిస్తున్న సినిమా 'ఆరాధన'. ఈ విభిన్న ప్రేమకథాచిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'వశిష్ట పార్థసారధి'ని దర్శకుడిగా, 'పృథ్విరాజ్'ని హీరోగా పరిచయం చేస్తూ... తాను నిర్మాతగా పరిచయమవుతూ "రవికిరణ్" నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ తోపాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.
చిత్ర నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ.. "సినిమా చూసిన ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా 'హృద్యమైన ప్రేమకథ'గా అభివర్ణించేంత గొప్పగా "ఆరాధన" చిత్రాన్ని తెరకెక్కించేందుకు మా దర్శకుడు వశిష్ట పార్థసారధి కృషి చేస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రాజేష్ ఖన్నాల "ఆరాధనల" సరసన మా "ఆరాధన" సగర్వంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



