ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని ఇద్దరు అతిధులు! ఫ్యాన్స్ ఏమంటారో మరి!
on Nov 20, 2025

ఆ ఇద్దరు వస్తే ఫ్యాన్స్ రియాక్షన్
ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచిన అఖండ 2
బాలయ్య జోరుని ఆపలేరు
డిసెంబర్ 5 న ఫ్యాన్స్ పండుగ
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి 'అఖండ 2(Akhanda 2)తో సిల్వర్ స్క్రీన్ వద్ద జూలు విదల్చడానికి రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరో సారి అఖండ 2 తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ప్రేక్షకుల్లో కూడా మూవీ పట్ల ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు బెంగుళూరు(Bengaluru)లో స్టార్ హీరో 'శివరాజ్ కుమార్' చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో కన్నడ ట్రైలర్ రిలీజ్ చేస్తారని టాక్.
ఇక తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే భారీగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాంతంతో పాటు, తెలంగాణలోని హైదరాబాద్ లో ఘనంగా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తునట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మరి కొద్దీ రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy),ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)చీఫ్ గెస్ట్ లుగా వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒక వేళ ఆ న్యూస్ నిజమైతే కనుక అభిమానుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రా జోష్ ని ఇవ్వడం ఖాయం.
also read: వందేళ్ల చరిత్రలో రజనీ నే తొలిసారి.. ఇండియా మొత్తం షాక్
గతంలో అఖండ మొదటి భాగానికి అల్లు అర్జున్, బాలయ్య నుంచి వచ్చిన మరో చిత్రానికి రేవంత్ రెడ్డి గెస్ట్ లుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆ ఇద్దరు గెస్ట్ లుగా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన లేదు. బాలయ్య నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో అఖండ 2 కి సంబంధించిన ప్రతి విషయంలోను మేకర్స్ ఎంతో ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



