ఇంతదాకా 'అఖండ' ఎంత వసూలు చేసిందో తెలుసా?
on Dec 20, 2021

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను రూపొందించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. విడుదలైన 18వ రోజు తెలుగునాట రూ. 68 లక్షల షేర్ సాధించింది. గమనించదగ్గ అంశమేమంటే 14వ రోజు నుంచి 17వ రోజు వరకు రోజువారీ వచ్చిన కలెక్షన్ల కంటే 18వ రోజు ఎక్కువ షేర్ రావడం! 18 రోజులకు తెలుగు ప్రాంతాల్లో అఖండ వసూళ్లు రూ. 56.68 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి. బాలయ్య కెరీర్‌లోనే ఇవి అత్యధిక వసూళ్లు.
Also read: 'అఖండ'లో మెయిన్ విలన్ రియల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా?
ఏరియా వైజ్ చూసుకుంటే, 18 రోజులకు తెలంగాణలో రూ. 18.92 కోట్లు, ఆంధ్రలో రూ. 23.38 కోట్లు, రాయలసీమలో రూ. 14.38 కోట్ల షేర్‌ను 'అఖండ' సాధించింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 4.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.34 కోట్ల షేర్‌ను కలుపుకుంటే 'అఖండ' టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్ రూ. 66.72 కోట్లకు చేరుకుంది.
Also read: 'అఖండ' కలెక్షన్లను తట్టుకోలేక దిగాలుపడ్డ వ్యతిరేక వర్గం!
అఖండగా బాలయ్య ప్రదర్శించిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ ఎపిసోడ్స్, బోయపాటి డైరెక్షన్ కలిసి 'అఖండ'ను బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిపాయి. సెకండ్ లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపుతెచ్చిన తొలి బిగ్ ఫిల్మ్‌గా నిలిచింది 'అఖండ'.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



