షాకింగ్.. హీరోయిన్ 'హంసానందిని'కి క్యాన్సర్!
on Dec 20, 2021

గతంలో హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడిన వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ పై ధైర్యంగా పోరాడి గెలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఆమె. అయితే తాజాగా మరో హీరోయిన్ హంసానందిని కూడా క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
హీరోయిన్ గా ఎంట్రీ చైనా హంసానందిని పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. దీనికి కారణం ఆమె క్యాన్సర్ బారిన పడటమే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆమె ఈ మహమ్మారితో తాను ధైర్యంగా పోరాడతానని, మళ్ళీ మీ ముందుకు నవ్వుతూ తిరిగి వస్తానని అన్నారు.
"కాలం నా జీవితంలో ఏ విధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు నడవాలనుకుంటున్నా.18 సంవత్సరాల క్రితం నా తల్లి క్యాన్సర్ తో మరణించారు. అప్పటి నుంచి నేను ఆ భయంతోనే బతుకుతున్నాను. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. పరీక్షల అనంతరం నాకు క్యాన్సర్ గ్రేడ్ 3 ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు తాజాగా తెలిపారు. దీని ద్వారా 70 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదా 40 శాతం గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి. ఇప్పటివరకు 9 సైకిల్స్ కీమోథెరపీ జరిగాయి.. మరో 7 చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. దీనితో పోరాడి.. నవ్వుతూ మీ ముందుకు వస్తాను" అని చెప్పుకొచ్చింది హంసానందిని.
హంసానందిని త్వరగా కోలుకొని మళ్ళీ మునుపటి ఎనర్జీతో ఆమె సినిమాలతో అలరించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



