తమిళ అగ్ర హీరో అజిత్ కొడుకు వీడియో వైరల్..ముమ్మాటికీ అజిత్ కొడుకే
on Apr 4, 2025
తమిళ అగ్ర హీరో అజిత్(Ajith Kumar)సినిమాల్లోనే కాదు,రేసింగ్ లోను కింగ్ అనే విషయం తెలిసిందే.సినీ లైఫ్ లో ఏ మాత్రం ఖాళీ దొరికినా కార్,బైక్ రైసింగ్ చేస్తుంటాడు.రేసింగ్ కి సంబంధించిన ఎన్నో పోటీల్లో పాల్గొన్న అజిత్ అండ్ టీం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులని కూడా సంపాదించింది.ఇటీవల ఇటలీలో జరిగిన 12 హెచ్ రేసుల పోటీల్లోను అజిత్ టీం మూడో స్థానం దక్కించుకుంది.
కొన్ని రోజుల క్రితం విదేశాలకి వెళ్లిన అజిత్ రీసెంట్ గా తిరిగొచ్చాడు.వచ్చి రావడంతోనే భార్య షాలిని(Shalini)కొడుకు అద్విక్(adwik)తో కలిసి రేసింగ్ కి సంబంధించిన 'మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ అరేనా' గో కార్ట్ లో సందడి చేసాడు.తన కొడుక్కి కారు రేసింగ్ లో మెళుకువులు నేర్పిస్తూ కనిపించగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో అజిత్ లాగానే అద్విక్ కూడా సినిమా ఇండస్ట్రీలోను రేసింగ్ రంగంలోను టాప్ పొజిషన్ లో ఉండాలని అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
అజిత్ సినిమాల విషయానికి వస్తే ఫిబ్రవరి 6 న 'విడామయుర్చి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ మూవీ తెలుగులో 'పట్టుదల' అనే పేరుతో విడుదలయ్యింది.అజిత్ మరో మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతుండగా,తెలుగులో అగ్ర చిత్ర నిర్మాతగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. త్రిష.ప్రభు,అర్జున్ దాస్,సునీల్,రాహుల్ దేవ్,షైన్ టామ్ చాకో,యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
