Aditya 369 : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్యా మజాకా!
on Apr 4, 2025
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'. తెలుగులో వచ్చిన ఈ మొదటి సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ నిర్మించింది. 1991లో విడుదలైన 'ఆదిత్య 369'.. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ చిత్రం, మరోసారి థియేటర్లలో అడుగుపెట్టింది. (Aditya 369 Re Release)
'ఆదిత్య 369'ను నేడు(శుక్రవారం) 4Kలో రీ-రిలీజ్ చేశారు. పేరుకి రీ రిలీజ్ అయినప్పటికీ ప్రమోషన్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవట్లేదు మేకర్స్. ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఇప్పుడు విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద.. ప్రత్యేకంగా రూపొందించిన టైం ట్రావెల్ మిషన్ రూపాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ మిషన్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పిల్లలు ఈ టైం ట్రావెల్ మిషన్ ని చూడటాన్ని ఎంతో ఆనందిస్తున్నారు.
'ఆదిత్య 369' రీ-రిలీజ్ సందర్భంగా చాలా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నందమూరి అభిమానులు ఈ క్లాసిక్ ఫిల్మ్ ని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
