బాలీవుడ్ పై విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు..నిర్మాత చిక్కుల్లో పడ్డాడా!
on Apr 4, 2025
'అర్జున్ రెడ్డి,గీత గోవిందం లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ ని పొందిన విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)గత కొంత కాలంగా పరాజయాలని చవి చూస్తున్నాడు.దీంతో తన అప్ కమింగ్ మూవీ 'కింగ్ డమ్'(KIngdom)పై విజయ్ దేవరకొండతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఇటివల రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే దేవరకొండ ఈ సారి హిట్ అందుకోవడం ఖాయమనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్నలూరి(Gowtam Tinnaluri)దర్శకత్వం వహిస్తున్న కింగ్ డమ్ ని,అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మే 30 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)హీరోయిన్.
విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో దక్షిణాది చిత్ర రంగంతో పాటు బాలీవుడ్ చిత్ర రంగం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసాడు.ఆయన మాట్లాడుతు వరల్డ్ వైడ్ గా దక్షిణాది చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎంతో ఉన్నత దశలో ఉంది.అందరు దక్షిణాది సినిమాలని చూడటానికి ఇష్టపడుతున్నారు.ఒకప్పుడు ఇక్కడి సినిమాలని సరైన గుర్తింపు ఉండేది కాదు.కాబట్టి ఇదొక సర్కిల్ లాంటిది.రానున్న ఐదు పదేళ్లల్లో పరిస్థితులు మరోలా ఉండవచ్చు.బాలీవుడ్ లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడింది.ఆ లోటుని తీర్చడానికి బాలీవుడ్ లో కొత్త దర్శకులు పుట్టుకొస్తారు.హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప దర్శకులని ప్రేక్షకులకి అందించబోతుందని నమ్ముతున్నాను.కాకపోతే వాళ్ళు బయట వాళ్ళు అయ్యుంటరాని అనిపిస్తుంది.
బాహుబలి వల్లనే తెలుగు సినిమాతో పాటు దక్షిణాది సినిమాకి గుర్తింపు వచ్చింది.బాహు బలి గొప్ప సినిమా అవుతుందని హిందీ చిత్ర పరిశ్రమకూడా అనుకోకపోయి ఉండవచ్చు.బాహుబలి వర్క్ అవుట్ కాకపోయి ఉంటే ఎంతో మంది కెరీర్ లు ముగిసిపోయేవి.నిర్మాతలు ఇబ్బంది పడే వాళ్ళు.ఆ సినిమా కోసం ఒక్కొక్కరు ఐదేళ్లు పని చేసారు.ప్రతి ఒక్కరు తమ స్థానం కోసం పోరాటం చెయ్యాలి.హిందీ చిత్ర పరిశ్రమ కూడా తమ దారుల్ని కనుక్కొని ఉన్నతంగా ముందుకు సాగుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు .

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
