ఇండియా-టిబెట్ బోర్డర్‌లో 'మేజర్'
on Mar 11, 2020
చిత్‌కుల్... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇండియా, టిబెట్ బోర్డర్‌లో చిట్టచివరలో ఉన్న ఇండియన్ విలేజ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సాధారణంగా శీతాకాలంలో మంచుదుప్పటి కప్పినట్టు ఉంటుంది. అక్కడ 'మేజర్' షూటింగ్ చేస్తున్నాడు అడివి శేష్. 2008లో జరిగిన ముంబయ్ 26/11 అటాక్స్ లో హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మేజర్ డ్యూటీ అంటే చలి, ఎండ, వాన అని చూడకుండా ప్రతికూల పరిస్థితుల్లో కష్టనష్టాలకు భయపడకుండా ముందడుగు వేయాలి. ఉన్నికృష్ణన్ అలా వేశారు కాబట్టి, ప్రాణాలను లెక్క చేయలేదు కాబట్టి ముంబయ్ అటాక్స్ లో అంతమంది ప్రాణాలను కాపాడారు. తన ప్రాణాలు వదిలారు. ముంబయ్ అటాక్స్ మాత్రమే కాకుండా, అంతకు ముందు ఆయన జీవితాన్ని కూడా సినిమాలో చూపిస్తున్నారట. మ్యాగ్జిమమ్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. అందుకని చిత్‌కుల్ వెళ్లారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Also Read