ఇంకెక్కడ 'ఖుషి' స్వామి.. 8 రోజుల్లో వసూళ్ళు చూసింది ఇంతేనా!
on Sep 9, 2023
ఫస్ట్ వీకెండ్ లో 'ఖుషి' జోరు చూసి.. హిట్ బొమ్మ కావడం ఖాయమనుకున్నారు ట్రేడ్ పండితులు. అయితే, మండే టెస్ట్ లో ఘోరంగా ఫెయిలైన ఈ సినిమా.. అప్పట్నుంచి తిరోగమన బాటలోనే వెళుతోంది. ఇక ఎనిమిదో రోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి. దీంతో.. ఈ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ లిస్ట్ లో చేరడం కష్టమేనంటున్నారు వాణిజ్య విశ్లేషకులు.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రూ. 1.05 కోట్ల షేర్, మంగళవారం రూ. 75 లక్షల షేర్, బుధవారం రూ. 47 లక్షల షేర్, గురువారం రూ. 36 లక్షల షేర్ వసూళ్ళు ఆర్జించిన 'ఖుషి'.. ఎనిమిదో రోజైన శుక్రవారం రూ. 22 లక్షల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 53.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'ఖుషి'.. ఈ 8 రోజులకి రూ. 38. 78 కోట్ల షేర్ చూసింది. ఓవరాల్ గా.. 73 శాతం+ రికవరీ అయిందన్నమాట.
'ఖుషి' 8 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.12.88 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.23 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.8.66 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.23.77 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా (ఇతర భాషల్లో కలుపుకుని) : రూ.6.45 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.8.56 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల కలెక్షన్స్ : రూ.38.78 కోట్ల షేర్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
