వెనక్కి తగ్గేదేలే.. కేసుని వదిలేదేలే!
on Feb 8, 2022

ఐదేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడుపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీసుధ న్యాయ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు ముగిసిపోలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని తేల్చి చెప్పింది.
శ్యామ్ పెళ్లి పేరిట ఐదేళ్ల పాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని సుధ అప్పట్లో హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా శ్యామ్ కు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సుధ పిటిషన్ ను కొట్టివేసి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఈ విషయంపై సుధ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. "బెయిల్ మాత్రమే లభించింది. కేసు ఇంకా బతికే ఉంది. నేను కూడా నువ్వు చేసిన అన్యాయంపై పోరాడటానికి బతికే ఉన్నాను. మున్ముందు ఎదురయ్యే సెషన్స్ ను ఎదుర్కొవడానికి రెడీగా ఉండు" అంటూ సుధ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



