తారక్, చరణ్ మధ్య తేడా అదే.. చరణ్ కి ఆ విషయం తెలీదు!
on Feb 8, 2022

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాని జనవరి 7 న విడుదల చేయాలని ప్లాన్ చేసిన మూవీ టీమ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ గా ముంబైలో 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. అయితే థర్డ్ వేవ్ కారణంగా మూవీ మార్చి 25 కి వాయిదా పడటంతో.. తాజాగా ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియోలను మూవీ టీమ్ విడుదల చేసింది. ఆ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ చరణ్, తారక్ మధ్య తేడా చెప్పాడు.
"చాలామంది వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి అని అడుగుతున్నారు. చరణ్ అద్భుతమైన నటుడు.. కానీ ఆ విషయం అతనికి తెలియదు. తారక్ అద్భుతమైన నటుడు.. ఆ విషయం అతనికి తెలుసు. షూట్ టైంలో చరణ్ కి యాక్టింగ్ ఫిదా అయ్యి, హగ్ ఇచ్చి బాగా చేశావు అంటే.. 'మీకు నచ్చిందా.. మీకు నచ్చితే ఓకే సార్' అంటాడు చరణ్. కానీ తారక్ అలా కాదు. అద్భుతంగా చేశావు తారక్ అని చెప్పేలోపే.. 'జక్కన్న అదరగొట్టేశాను కదా' అంటాడు. అది తారక్ కాన్ఫిడెన్స్." అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
"ఆర్ఆర్ఆర్ కోసం చరణ్, తారక్ ఇద్దరినీ విపరీతంగా కష్టపెట్టానని రాజమౌళి అన్నారు. "ఇంట్రడక్షన్ సీన్ కోసం తారక్ ని చెప్పుల్లేకుండా అడవిలో పరుగెత్తించాను. అయినా అతను పులిలా పరుగెత్తాడు. ఇక చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం అయితే రెండు వేల మంది మధ్య దుమ్ములో నిలబెట్టాను. ఈ సీన్ నా కెరీర్ లో బెస్ట్ సీన్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇంటర్వెల్ సీన్ కోసం 65 రాత్రులు షూట్ చేశామని, ఇక క్లైమాక్స్ షూట్ గురించి అయితే మాటల్లో చెప్పలేం" అని రాజమౌళి అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



