అర్జున్ నాకు ఫుడ్ పంపేవారు!
on Feb 8, 2022

మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఖిలాడి'. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 11 న థియేటర్స్ లో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హీరోయిన్స్ మీడియాతో ముచ్చటించారు.
విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన 'సామాన్యుడు' సినిమా ఈ నెల 4 న విడుదలైంది. కేవలం వారం వ్యవధిలో మరో సినిమా ఖిలాడి(ఫిబ్రవరి 11)తో వస్తుండటంపై హయతి సంతోషం వ్యక్తం చేసింది. నిజానికి ఖిలాడి సినిమానే తాను ముందు చేశానని, కానీ సామాన్యుడు ముందు విడుదలైందని తెలిపింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రావడం హ్యాపీగా ఉందని పేర్కొంది.
రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ పై ఇద్దరు హీరోయిన్స్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ ని మ్యాచ్ చేయడం కష్టమని అన్నారు. షూటింగ్ లో మొదటిరోజే రవితేజతో కామెడీ సీన్ చేయాల్సి వచ్చిందని, ఆయన కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చేయలేనన్న భావనతో కాస్త ఇబ్బంది పడ్డానని డింపుల్ హయతి తెలిపింది. అయితే ఆయన సూచనలు, ఆయన బిహేవియర్ తో షూటింగ్ చాలా హ్యాపీగా సాగిపోయింది అంటూ డింపుల్ హయతి చెప్పుకొచ్చింది.
అర్జున్ సార్ ఖిలాడికి ముందు నుంచే తనకు తెలుసని డింపుల్ చెప్పింది. అప్పట్లో తాను ఓ కన్నడ సినిమా చేశానని, అయితే అది విడుదల కాలేదని తెలిపింది. ఆ సినిమా టైంకి నేను ఆడియన్స్ కి తెలీదు, అయినా అర్జున్ సర్ నాకు ఆయన ఇంటి నుంచి ఫుడ్ పంపించేవారని డింపుల్ పేర్కొంది. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, అది ఖిలాడి లాంటి మంచి సినిమాతో నేరవేరడం ఆనందంగా ఉందని డింపుల్ తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



