కూతురు విషయంలో ఆ తప్పు చేయనంటున్న మీనా...!
on Apr 16, 2016
మీనా ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి సౌత్‌లోని టాప్ స్టార్స్ అందరితో నటించిన కథానాయిక. 1982లో బాలనటిగా నెంజంగల్ చిత్రంలో నటించింది. 1991లో సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక దశాబ్ధం పాటు అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగింది. అవకాశాలు తగ్గడంతో 2009లో విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుంది.
వీరికి ఒక పాప. ఆ పాప పేరు నైనిక అయితే మీనా ఏ విధంగా బాలనటిగా ఎంట్రీ ఇచ్చిందో అలాగే ఆమె కూతురు కూడా బాలనటిగా నటించింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన లేటేస్ట్ మూవీ తెరిలో హీరో కూతురిగా నైనిక నటించింది. ఈ పాప ఇప్పుడే తన నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయితే ఈ సినిమాలో చేసినంత మాత్రాన ఇకపై నైనిక చైల్డ్ యాక్టర్‌గా కొనసాగదని తేల్చిచెప్పింది మీనా. దీనికి కారణం తన చిన్నతనంలో బాలనటిగా ఏం మిస్సయ్యానో తనకు తెలుసనని..అలాంటి తప్పు నైనిక విషయంలో చేయనని. తన కూతురు బాల్యాన్ని బాగా ఏంజాయ్ చేయాలనేదే తన కోరిక అని చెప్పిందట.