దిగులు తీరింది..పుత్రోత్సాహంలో మోహన్‌బాబు..!
on Apr 16, 2016
తెలుగు సినీరంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మోహన్ బాబు. తనతో పాటు తన వారసుల్ని కూడా పరిశ్రమకు పరిచయం చేసి నిజమైన సినీ భక్తుడనిపించుకున్నారు. అలాంటి ఆయనకు గత కొన్ని రోజులుగా ఒక దిగులు పట్టుకుంది. ఎన్ని సినిమాలు చేసినప్పటికి విష్ణు, మనోజ్‌లకు సరైన హిట్ దొరకడం లేదు దీంతో ఆయన కొంచెం డిప్రెషన్‌లో ఉన్నారట.
లేటేస్ట్‌గా మంచు విష్ణు నటించిన ఈడోరకం..ఆడో రకం మూవీ మొన్న అభిమానుల ముందుకు వచ్చింది. ఫస్ట్ అవర్‌లోనే సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో మంచు అభిమానులు ఖుషి అయ్యారు. దీనికి ఉబ్బితబ్బైన కలెక్షన్ కింగ్ తనయుడు నటించిన సినిమాని నిన్న అభిమానులతో కలిసి థియేటర్‌లో చూడాలనుకున్నారు. అయితే తాను అనుకున్న సమయానికి టికెట్లు దొరకలేదు. దీంతో నిర్మాత అనీల్ సుంకరను అడిగి శనివారానికి టిక్కెట్లు తెప్పించుకున్నారు. పైగా ఆరోజు కూడా తాను అడిగినన్ని టికెట్లు దొరకలేదని చెప్పారు. మొత్తానికి తనకి టికెట్లు దొరకలేదన్న బాధ ఉన్నప్పటికీ తన కొడుకు సినిమా మంచి విజయం సాధించడం పట్ల మోహన్ బాబు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఈ రకంగా పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు పెదరాయుడు.