'నువ్వు నేను' హీరోయిన్ తల్లి కాబోతోంది!
on Oct 10, 2020
తేజ దర్శకత్వం వహించగా ఉదయ్ కిరణ్ సరసన 'నువ్వు నేను' చిత్రంలో నాయికగా నటించడం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై, తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న అందాల తార అనిత తల్లి కాబోతోంది. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియోతో ఈ బిగ్ న్యూస్‌ను ఆమె అనౌన్స్ చేసింది. 2013లో గోవాలో ఆమె వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది.
తను, రోహిత్ ఉన్న ఓ అందమైన వీడియోను అనిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో వాళ్ల తమ లవ్ స్టోరీని మళ్లీ మన కళ్ల ముందు ఆవిష్కరించారు. మొదటగా లవర్స్‌గా కనిపించడం, రోహిత్ ప్రపోజ్ చేయడం, పెళ్లి, ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించడం దాకా ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. సినీ రంగం నుంచి టీవీ రంగంలోకి వెళ్లి అక్కడ బాగా పాపులర్ అయిన అనిత వీడియో చివరలో ఉబ్బెత్తుగా ఉన్న తన కడుపును చూపించగా, రోహిత్ ఆమె కడుపును ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ వీడియోకు "లవ్ యు రోహిత్" అనే క్యాప్షన్, హార్ట్ ఎమోజీలతో షేర్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
