సీక్రెట్‌గా 'బస్ స్టాప్' హీరోయిన్ పెళ్లి!
on Jan 7, 2021
మారుతి డైరెక్ట్ చేసిన 'బస్ స్టాప్' మూవీలో ఓ హీరోయిన్‌గా నటించడం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆనంది సీక్రెట్‌గా ఈ రోజు పెళ్లాడుతోందంటూ ప్రచారం గుప్పుమంటోంది. 'బస్ స్టాప్' మూవీ తర్వాత తెలుగులో రక్షిత పేరుతో రెండు మూడు సినిమాలు చేసినా సరైన పేరు రాకపోవడంతో 'కాయల్' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాతో కాయల్ ఆనందిగా పాపులర్ అయ్యింది.
తాజాగా ఆమె సోక్రటీస్ అనే యువకుడిని తన స్వస్థలం వరంగల్‌లో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు పెళ్లాడుతోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానీ, పీఆర్ ద్వారా కానీ బయటకు వెళ్లడించలేదు. వరంగల్‌లోని ఓ స్టార్ హోటల్‌లో కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లాడుతోందని సమాచారం. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారెవరినీ ఈ వేడుకకు ఆమె ఆహ్వానించలేదు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం.
ఆనంది త్వరలోనే తెలుగులో 'జాంబీ రెడ్డి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నాడు. ఆరేళ్ల విరామంతో ఆనంది తెలుగులో నటించిన సినిమా ఇది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
