బాప్‌రే.. "బుట్టబొమ్మ" సాంగ్.. 500 మిలియన్ వ్యూస్!
on Jan 7, 2021
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటకు ప్రేక్షకుల్లో తిరుగులేని విధంగా ఆదరణ దక్కుతోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో..' వారిపై చిత్రీకరించిన "బుట్టబొమ్మ" వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 500 మిలియన్ అంటే 50 కోట్ల వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ హిస్టరీలో ఓ వీడియో సాంగ్ ఈ మార్క్‌ను అందుకోవడం ఇదే ప్రథమం. తమన్ స్వరాలు కూర్చగా, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు.
2020 ఫిబ్రవరి 25న ఆదిత్యా మ్యూజిక్ చానల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ సాంగ్‌కు 3.3 మిలియన్ లైక్స్ రావడం మరో విశేషం. అంతేకాదు, దాదాపు ఒక లక్షా 12 వేల కామెంట్స్ కూడా దీనికి వచ్చాయి. కేవలం తెలుగు సంగీత ప్రియులనే కాకుండా ఈ పాట అన్ని భాషలవారినీ ఆకట్టుకుంటోందంటే దానికి కారణం.. తమన్ మ్యూజిక్‌తో పాటు, తెరపై బన్నీ-పూజా మధ్య కెమిస్ట్రీ కూడా. బన్నీ వేసిన స్టెప్స్ అయితే యూనిక్‌గా ఉండి మరీ అలరిస్తున్నాయి. అతని చేత ఆ స్టెప్స్ వేయించింది కొరియోగ్రాఫర్ జాని మాస్టర్.
ఇదే సినిమాలోని 'రాములో రాములా' వీడియో సాంగ్‌కు 280 మిలియన్ వ్యూస్, 'సామజవరగమన' సాంగ్‌కు 155 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
