'సెకండ్ హ్యాండ్ ఐటమ్' అంటూ నీచమైన పోస్ట్ పెట్టిన నెటిజన్.. ఇదీ సమంత రెస్పాన్స్!
on Dec 22, 2021

కెరీర్‌లోనే తొలిసారిగా 'పుష్ప' మూవీలో "ఊ అంటావా మావా" అనే ఐటమ్ సాంగ్ చేసి వార్తల్లో నిలిచింది సమంత. అల్లు అర్జున్‌తో కలిసి చేసిన ఆ సాంగ్ ఇన్‌స్టంట్ హిట్టయింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఆ సాంగ్‌ను ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన విధానం యువతరాన్ని కిర్రెక్కించింది. అయితే ఆ సాంగ్‌లో సమంత కనిపించిన తీరుపై ఆమెను ద్వేషించేవారు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక ట్విట్టర్ యూజర్ ఆమెపై ఒక నీచమైన కామెంట్ చేశాడు.
Also read: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్.. శేఖర్ కమ్ముల సినిమా వెనక్కి!
తన ట్వీట్‌లో అతను సమంతను 'విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ ఐటమ్' అంటూ సంబోధించడమే కాకుండా, ఒక 'జెంటిల్‌మేన్' నుంచి ఆమె రూ. 50 కోట్లు దోచుకుందంటూ ఆరోపించాడు. జెంటిల్‌మేన్ అని అతను ప్రస్తావించింది.. సమంత మాజీ భర్త నాగచైతన్యను ఉద్దేశించి. ఆ ట్వీట్ సమంత దృష్టికి రావడంతో దానికి రెస్పాండ్ అయ్యింది. ఎంతో హుందాగా "కమరళి దుకందర్ గాడ్ బ్లెస్ యువర్ సోల్" అంటూ రిప్లై ఇచ్చింది.

అయితే ఆమె రిప్లై ఇచ్చిన తర్వాత కుమరళి దుకందర్ అనే ఆ యూజర్ పోస్ట్‌ను డిలీట్ చేయడంతో పాటు అతడి అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. పలువురు నెటిజన్లు తాము సమంత అభిమానులం కామనీ, అయినప్పటికీ కమరళి దుకందర్ నీచమైన పోస్టును చూసి భరించలేకపోయామని కామెంట్లు పెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



