వ్యానిటీలో 'పుష్ప'గా బన్నీ ఇలా మారిపోయేవాడు!
on Feb 9, 2022

అల్లు అర్జున్ తన లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప'ను సాధ్యమైనంత బిగ్ ఫిల్మ్ చేయడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' మూవీలో టైటిల్ రోల్ పోషించాడు బన్నీ. ఆ మూవీలో మంచి, చెడు రెండు రకాల కోణాలున్న పాత్రలో డీగ్లామర్డ్ లుక్‌లో అతను కనిపించాడు. అక్షరాలా నెలల తరబడి ఆ పాత్రలో జీవించాడు. ఏది ఏమైనప్పటికీ, అల్లు అర్జున్ భారీ మేకప్ ట్రాన్ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. Also read: 'కళావతి' కోసం.. కీర్తిపై వాలిపోయిన మహేష్!
పుష్పరాజ్‌గా తన భారీ రూపాంతరం కోసం అల్లు అర్జున్ సిద్ధమవుతున్న ప్రత్యేక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది అతని అత్యుత్తమ నటన అనీ, అతను తప్ప ఎవరూ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయేవారనీ విమర్శకులు అభిప్రాయపడ్డారు. పుష్పరాజ్‌గా మారడం కోసం అల్లు అర్జున్ తీవ్రమైన మేకప్, ప్రొస్తెటిక్ సెషన్ చేయించుకోవలసి వచ్చింది. తన కనుబొమ్మలు, గిరజాల జుట్టును సరిగ్గా పొందడం నుండి కచ్చితమైన స్కిన్ కలర్‌ను పొందడం వరకు, బన్నీ తన రూపాన్ని మార్చుకున్నాడు. వీడియోలో, అల్లు అర్జున్ తన మేకప్ వ్యాన్‌లో చాలా మంది ఆర్టిస్టులు పనిచేస్తుండగా ఓపిగ్గా కూర్చొని మేకప్ చేయించుకోవడం మనం చూడవచ్చు. మేకప్ అయ్యాక అతను 'పుష్ప' శైలిలో వానిటీ వ్యాన్ నుండి బయటకు వచ్చాడు. పర్ఫెక్షనిస్ట్‌గా కనిపించడం కోసం, శారీరకంగా, ప్రోస్తేటిక్స్ మేకప్ సహాయంతో తనను తాను అల్లు అర్జున్ ఎలా మార్చుకున్నాడో ఈ వీడియో మనకు చూపిస్తోంది. Also read: నువ్వెప్పుడూ బ్యూటిఫుల్‌గా ఉంటావు! కాజల్‌పై సమంత కామెంట్!!
థియేట్రికల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాక, 'పుష్ప' అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT అరంగేట్రం చేసింది. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా OTT ప్లాట్‌ఫారమ్‌లో అధిక వ్యూయర్‌షిప్‌తో భారీ రికార్డును నెలకొల్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



