Home

»

Latest News

హిమ‌జ‌కు టెన్త్ క్లాస్‌లో ద‌స‌రా రోజు ప్ర‌పోజ్ చేసిన అబ్బాయి!

Jan 27, 2022 11:35AM

 

ఇటు సినిమాల్లో, అటు సీరియ‌ల్స్‌లో చేసిన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల అభిమానాన్ని సంపాదించుకున్న తార.. హిమ‌జ‌. బిగ్ బాస్ సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గా ఇంటిల్లిపాదికీ ఆమె చేరువైంది. ఆమె ల‌వ్ లైఫ్ గురించి ఇంత‌దాకా మ‌న‌కేమీ తెలీదు. అయితే తొలిసారి ఆమె త‌నెప్పుడు ప్రేమ‌లో ప‌డిందో తెలిపింది.. అదెప్పుడంటే.. టెన్త్ క్లాస్‌లో! అవును. అప్పుడు ఓ అబ్బాయి.. అదీ ద‌స‌రా రోజు ల‌వ్ లెట‌ర్ ఇచ్చి ప్ర‌పోజ్ చేశాడ‌నీ, అది త‌ల‌చుకుంటే త‌న‌కు హ్యాపీగా అనిపిస్తుంటుంద‌నీ ఆమె చెప్పింది.

Also read: య‌శ్‌ను క్ష‌మించ‌మ‌ని కోరిన ఆమిర్‌.. రీజ‌న్ ఏంటో తెలుసా?

ఈ విష‌యాన్ని 'టెన్త్ క్లాస్ డైరీస్' అనే సినిమా టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో వెల్ల‌డించింది హిమ‌జ‌. సినిమాటోగ్రాఫ‌ర్ అంజి డైరెక్ట‌ర్‌గా మారి తీస్తున్న తొలి సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్‌'. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఇది ఆయ‌న‌కు 50వ సినిమా. శ్రీ‌రామ్‌, అవికా గోర్ జంట‌గా న‌టించిన ఈ సినిమాలో హిమ‌జ ఓ కీల‌క పాత్ర చేసింది. బుధ‌వారం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది.

Also read: పూర్ణ హీరోయిన్‌గా ర‌విబాబు వ‌రుస‌గా మూడు సినిమాలు ఎందుకు చేశాడు?

ఈ ఈవెంట్‌లో హిమ‌జ మాట్లాడుతూ, "ప్ర‌తి ఒక్క‌రికీ టెన్త్ క్లాస్‌లో స్పెష‌ల్ మూమెంట్స్ ఉంటాయి. నాకైతే చాలా బ్యూటిఫుల్ మెమ‌రీస్ ఉన్నాయి. న‌న్ను ఫ‌స్ట్ ప్ర‌పోజ్ చేసింది టెన్త్ క్లాస్‌లోనే. అత‌ని పేరు నేను చెప్ప‌ను, ఎక్క‌డున్నాడో ఏమో. అత‌నికి పెళ్ల‌య్యుంటే లేనిపోని ప్రాబ్లెమ్స్‌. ఎప్పుడైనా మ‌న‌ల్ని ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ్డ‌మ‌నేది చాలా స్పెష‌ల్ థింగ్‌. అలాంటిది నాకు టెన్త్ క్లాస్‌లోనే ల‌వ్ లెట‌ర్ వ‌చ్చింది. అది గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అత‌ను ద‌స‌రా రోజు ప్ర‌పోజ్ చేశాడు. అలా నాలాగే చాలామందికి పాజిటివ్ మెమ‌రీస్ ఉంటాయి. ఫ్రెండ్‌షిప్ప‌యినా, ల‌వ్వ‌యినా.. ఏదైనా. ఆ రోజుల్లో ఫ‌స్ట్ టైమ్ జ‌రిగేవి చాలా స్పెష‌ల్ మూమెంట్స్‌. లైఫ్ లాంగ్ ఉండిపోతాయ్‌." అని చెప్పుకొచ్చింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com