కొడుకును పరిచయం చేసిన విశాల్!
on Jul 30, 2023
ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు విశాల్. వరుసగా సినిమాలు చేస్తూ, ఆ న్యూస్‌లో ఉంటారు. అలా కాని పక్షంలో చెన్నైలో ఫిల్మ్ చాంబర్ గొడవల్లోనో, నిర్మాతల మండలి వ్యవహారాల్లోనో, నడిగర్ సంఘం విషయంలోనో... ఏదీ లేకుంటే యాక్సిడెంటుల వార్తల్లోనో కనిపిస్తూనే ఉంటారు.
ఈ మధ్య తన నెక్స్ట్ సినిమాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు విశాల్. ఓ వైపు నెక్స్ట్ మూవీస్ పనులున్నా, తన కొడుకు బర్త్ డే ని మాత్రం గ్రాండ్‌గా జరుపుకున్నారు.
విశాల్ కొడుకు పేరు ఆగీ. ఈ 14 ఏళ్ల కొడుకు పుట్టినరోజు వేడుకలను అమ్మానాన్నల సమక్షంలో ఇష్టంగా కేక్ కట్ చేసి నిర్వహించుకున్నారు విశాల్. విశాల్‌కి పెళ్లి ఎప్పుడు అయింది? కొడుకు ఎప్పుడు పుట్టాడు? అని అనుమానిస్తున్నారా? ఆగి విశాల్ పెట్ డాగ్ పేరు. ఆగి పుట్టినరోజునే గ్రాండ్‌గా నిర్వహించారు విశాల్.
విశాల్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ మార్క్ ఆంటోని. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న విడుదల కానుంది ఈ సినిమా. గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వరాఘవన్, రీతు వర్మ, అభినయ, వైజీ మహేంద్ర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా తర్వాత హరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు విశాల్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. తామిరభరణి, పూజై సినిమాలతో ఇంతకు ముందు జనాలకు ట్రీట్ ఇచ్చారు వీరిద్దరూ. ఇప్పుడు చేస్తున్న సినిమాను టెంటేటివ్‌గా విశాల్ 34 అని పిలుస్తున్నారు జనాలు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాతో విశాల్ పూర్వ వైభవం రావడం గ్యారంటీ అన్నది యూనిట్ చెబుతున్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
